![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ రాబోయే వారానికి "ఫామిలీ థీమ్" ఇచ్చింది శ్రీముఖి. దాంతో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చారు. రోహిణి వాళ్ళ నాన్నను తీసుకొచ్చింది. ఐతే శ్రీముఖి వచ్చి ఆయనకు షాక్ హ్యాండ్ ఇస్తుండగా రోహిణి నాన్నో అంటూ గట్టిగా పిచ్చిగా అరుస్తూ ఉంది. వెంటనే శ్రీముఖి షాకింగ్ ఫేస్ పెట్టి ఇందాకే కదవే కింద కలిశావ్ అప్పుడే డాడీ అని అరుస్తున్నావేంటి.. అవసరమా అని అడిగింది. తర్వాత పృథ్వి శెట్టిని చూస్తూ "షూటింగ్ పేరుతో సగం టైం నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావ్ ఇక ఫామిలీతో గడిపే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు" అంది.
"ఫ్యామిలీ నా గుండెల్లో ఉంటారు" అని చెప్పాడు పృద్వి. దాంతో శ్రీముఖి నవ్వేసింది. తర్వాత నిఖిల్ విజయేంద్ర సింహ వాళ్ళ అమ్మ స్టేజి మీదకు వచ్చేసరికి "మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, నిఖిల్..సౌర్య ..ఇద్దరిలో ఎవరు ఆటల్లో స్మార్ట్ " అని అడిగింది. "నిఖిల్ ప్లే చేసే గేమ్స్ వేరు..సౌర్య ప్లే చేసే గేమ్స్ వేరు అని చెప్పింది" నిఖిల్ వాళ్ళ అమ్మ. ఇక ఫైనల్ గా డెబ్జానీ దగ్గరకు వచ్చి "నీకు ఎలాంటి ఫ్యామిలీ కావాలి" అని అడిగింది శ్రీముఖి. "ఎలాంటి ఫ్యామిలీ ఐనా పర్లేదు కానీ గొడవలు లేకుండా ఉంటే చాలు" అంది. అంతే వెంటనే జైల్లో ఉన్న ఇమ్మానుయేల్ డెబ్జానీని చూస్తూ "మా ఇంట్లో వాళ్లకు అసలు గొడవలు అంటే పడదు" అని చెప్పాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఐతే " డెబ్జానీని తెగ పొగిడేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు".డెబ్జానీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి వేదా రోల్ ద్వారా బాగా దగ్గయ్యింది. తర్వాత సత్యభామ సీరియల్ లో నటించింది.
![]() |
![]() |